Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముందుచూపుతో భారీగా చమురును దాచి పెట్టుకున్న చైనా

ముందుచూపుతో భారీగా చమురును దాచి పెట్టుకున్న చైనా

వార్త 2 months ago

చైనా వ్యూహాత్మక చతురత, ఆ దేశం తన ప్రయోజనాల కోసం ముందస్తుగా వేసే అడుగులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతుందని ముందే ఊహించిన China, తన దేశంలో అసాధారణ స్థాయిలో చమురు నిల్వలను సిద్ధం చేసుకుంది.

తాజా గణాంకాల ప్రకారం.. చైనా ప్రస్తుతం సుమారు 1.4 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలను కలిగి ఉంది. ఇది ఎంతటి భారీ మొత్తం అంటే, అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) లోని 32 సభ్య దేశాల వద్ద ఉన్న మొత్తం నిల్వలు (1.2 బిలియన్ బారెళ్లు) కంటే కూడా చైనా వద్ద ఉన్న నిల్వలే అధికంగా ఉండటం గమనార్హం.

 Iran-America War

Iran-America War: ప్రపంచం మొత్తం యుద్ధం, ఆర్థిక సంక్షోభం గురించి ఆందోళన

ప్రస్తుతం ప్రపంచ దేశాలు హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటుతుంటే ఆందోళన చెందుతున్నాయి. కానీ, డ్రాగన్ దేశం మాత్రం అత్యంత నిశ్చింతగా కూర్చుని ఉంది. ఈ సంక్షోభాన్ని ముందే పసిగట్టిన చైనా, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే తన చమురు దిగుమతులను ఏకంగా 15.8 శాతం మేర పెంచుకుంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలు చమురు కొరతతో కొట్టుమిట్టాడుతున్నా, చైనా తన నిల్వలతో దీర్ఘకాలం పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనుగడ సాగించగలదు. యుద్ధం కారణంగా పెరిగిన ధరలను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాత్మక నిల్వల నుంచి 172 మిలియన్ బారెళ్లను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, అమెరికా వద్ద ఉన్న మొత్తం నిల్వలు కేవలం 405 మిలియన్ బారెళ్లు మాత్రమే ఉండటం చైనా కంటే తాము ఎంత వెనుకబడి ఉన్నామో స్పష్టం చేస్తోంది. ప్రపంచం మొత్తం యుద్ధం, ఆర్థిక సంక్షోభం గురించి ఆందోళన చెందుతుంటే, చైనా మాత్రం తన ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి విఘాతం కలగకుండా ముందస్తుగా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. హార్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణా నిలిచిపోయినా, అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటినా చైనాకు పెద్దగా నష్టం ఉండదు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి! అమెరికా నౌకాదళానికి అధ్యక్షుడు సంచలన ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha