Dailyhunt
చమురు ధరలను పెంచిన ఇండియన్ ఆయిల్.. కొత్త రేట్లు ఇవే!

చమురు ధరలను పెంచిన ఇండియన్ ఆయిల్.. కొత్త రేట్లు ఇవే!

వార్త 1 week ago

IOC Premium Petrol Price Hike: పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండుతుండటంతో, దేశీయ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రీమియం ఇంధన ధరలను భారీగా పెంచింది.అంతర్జాతీయ మార్కెట్‌లో సరఫరా అంతరాయాల కారణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన ప్రీమియం వేరియంట్లపై ధరలను సవరించింది:

Read Also:Nirmala Sitharaman: పరువు నష్టం కేసు.. నిర్మలా సీతారామన్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట

 Indian Oil Corporation

IOC Premium Petrol Price Hike: ధరల పెంపు వివరాలు

హై-ఎండ్ లగ్జరీ కార్లు, సూపర్ బైక్‌లలో ఉపయోగించే ఎక్స్‌పీ100 పెట్రోల్ ధరను లీటరుకు రూ.11 పెంచింది. దీంతో ఎక్స్‌పీ100 లీటర్ పెట్రోల్ ధర రూ.160కి చేర్చారు. ప్రీమియం డీజిల్ వేరియంట్ 'ఎక్స్‌ట్రా గ్రీన్' ధరను లీటరుకు రూ.91.49 నుంచి రూ.92.99కి పెంచింది.ప్రస్తుతానికి ప్రీమియం ఇంధనాల ధరలు పెరిగినప్పటికీ, సాధారణ పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధ మేఘాలు తొలగిపోతే తప్ప ధరలు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ్ విషయంలో వెనక్కి తగ్గిన దర్శకుడు సుందర్ సి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha