Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో తగిన ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేస్తూ మంత్రికి భారీ ఊరటనిచ్చింది.
Read Also:Luthra Brothers Bail Goa: నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో లుత్రా సోదరులకు బెయిల్.. కానీ!
కేసు నేపథ్యం
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై పరువు నష్టం ఫిర్యాదు దాఖలు చేశారు. గతంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగించేలా మంత్రి వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.
Nirmala Sitharaman: కోర్టు తీర్పు – ముఖ్యాంశాలు
ఈ ఫిర్యాదుపై బుధవారం విచారణ చేపట్టిన అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) పరస్ దలాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.నిందితురాలిపై (నిర్మలా సీతారామన్) విచారణ జరిపేందుకు లేదా తదుపరి చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదుదారు సమర్పించిన ఆధారాలు ఏమాత్రం సరిపోవని కోర్టు అభిప్రాయపడింది.”ఈ విషయంలో ముందుకు వెళ్లడానికి నాకు ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదు. అందుకే ఈ ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరిస్తున్నాను” అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.
Nirmala Sitharaman Defamation Case Rejected
వివాదానికి కారణమైన మే 17 ప్రసంగం
2024 మే 17న నిర్వహించిన ఒక మీడియా కాన్ఫరెన్స్‌లో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఈ న్యాయపోరాటానికి దారితీశాయి.ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి, ఆయన భార్య లిపికా మిత్రల మధ్య ఉన్న కుటుంబ కలహాలను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అయ్యాయి.వీడియోలు అప్పట్లో వైరల్ కావడంతో.. లిపికా మిత్ర కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై పరువునష్టం దావా కేసు వేశారు.
దురుద్దేశపూర్వం
అందులో తన వైవాహిక జీవితానికి సంబంధించి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవమైనవి పేర్కొన్నారు. ఇవి పూర్తి దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని ఆరోపించారు.న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త పరువు తీయడమే లక్ష్యంగా నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారని లిపికా మిత్ర పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రసారం కావడం వల్ల తన భర్త అంతర్జాతీయ స్థాయిలో అవమానానికి గురయ్యారని,
తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 356(1), 356(2) కింద నిర్మలా సీతారామన్‌ను విచారించాలని.. అలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయకుండా అడ్డుకోవాలని ఆమె కోర్టును కోరారు. అంతేకాకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సదరు వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేయాలని కూడా విన్నవించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

