Jagan - CBN : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పక్షం రోజుల గడువు ఇస్తూ భారీ అల్టిమేటమ్ జారీ చేశారు.
రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన ఆక్వా ఫీడ్ (రొయ్యలు, చేపల మేత) ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించకపోతే, జులై 1 లేదా 2వ తేదీల్లో ఆక్వా రైతుల పక్షాన పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఆక్వా రైతులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సుదీర్ఘంగా చర్చించారు. మార్కెట్లో ఆక్వా ఫీడ్ విక్రేతలంతా ఒక కూటమిగా (సిండికేట్) ఏర్పడి కృత్రిమ కొరత సృష్టిస్తూ, ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ కు ఐదేళ్ల జైలు శిక్ష
YS Jaganబాబు హయాంలో సిండికేట్ల రాజ్యం: గత ప్రభుత్వ సబ్సిడీలను గుర్తుచేసిన జగన్
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆక్వా ఫీడ్ ధరను కేజీకి రూ. 4 పెంచిన వ్యాపారులు, ప్రస్తుత జూన్ నెల కొచ్చేసరికి ఏకంగా రూ. 10 నుంచి రూ. 12 వరకు అదనంగా పెంచేసి రైతు నడుము విరిచారని జగన్ మండిపడ్డారు. ప్రస్తుతం మార్కెట్లో దోపిడీకి పాల్పడుతున్న ఈ సిండికేట్ కంపెనీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు, ఆయన సామాజికవర్గానికి చెందిన వారివేనని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. తమ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు అండగా నిలబడ్డామని, కరెంట్ ఛార్జీల భారం పడకుండా యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ. 1.50 లకే అందించి, ఐదేళ్లలో ఏకంగా రూ. 3,306 కోట్ల భారీ విద్యుత్ సబ్సిడీని భరించామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీడ్ ధరలను అదుపు చేయకపోతే ఆక్వా బెల్ట్ జిల్లాల్లో ఉద్యమం తప్పదని జగన్ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు!

