Dailyhunt
చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ

చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ

వార్త 1 week ago

అమరావతి గ్రోత్ ఇంజిన్ అవుతుందన్న ప్రపంచ బ్యాంక్

Amaravati Development : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సచివాలయంలో సమావేశమైంది.

ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వారు సమీక్ష నిర్వహించారు.

అమరావతి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుంది

అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ మరియు విద్యుత్ రంగాల్లో చేపట్టిన సంస్కరణలు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో అమరావతి వాణిజ్య కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

Read Also : AP Transport Department: ఏపీలో స్లీపర్ బస్సుల నిషేధం? బస్సు ప్రమాదాల నివారణకు కొత్త రూల్స్!

 Amaravati Development

సమగ్ర అభివృద్ధిపై సీఎం వివరణ

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తగ్గేదేలే అంటున్న ట్రంప్ మరోసారి భారీగా పెంచిన టారిఫ్ లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha