Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో స్లీపర్ బస్సుల నిషేధం? బస్సు ప్రమాదాల నివారణకు కొత్త రూల్స్!

ఏపీలో స్లీపర్ బస్సుల నిషేధం? బస్సు ప్రమాదాల నివారణకు కొత్త రూల్స్!

వార్త 2 months ago

AP Transport Department: ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్లీపర్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతుండటం, ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుండటంతో ఏపీ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో స్లీపర్ బస్సులను పూర్తిగా రద్దు చేసే దిశగా రవాణా శాఖ కసరత్తు చేస్తోంది.

Read Also: Dr NTR Vaidya Seva Trust: 104 సంచార వైద్య వాహనాల్లో మందుల సరఫరా మరింత పటిష్టం

 Ban on sleeper buses in AP? Government’s sensational decision over series of accidents!

AP Transport Department: స్లీపర్ బస్సుల రద్దుపై కేంద్రంతో సంప్రదింపులు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్లీపర్ బస్సుల ఫిట్‌నెస్ సమస్యలు, ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటపడే అవకాశం తక్కువగా ఉండటం వంటి అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో స్లీపర్ బస్సులను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అలాగే బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం బస్సు లో ప్రయాణించే దూరం ఆధారంగా గమ్యానికి చేరే సమయాన్ని కూడా నిర్ణయించి, అంతకంటే తక్కువ సమయంలో చేరితే సిటీలోకి అనుమతించబోమని ఆయన తెలిపారు.

వేగ నియంత్రణకు ‘టైమ్ లాక్’ నిబంధన

అలాగే 300 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూస్తామని, వీరిలో ఒకరు రాత్రిపూట డ్రైవర్ నిద్రపోయేందుకు వీలుగా బస్సులో ఓ సీటు కూడా కేటాయించేలా ప్రైవేటు ఆపరేటర్లను ఆదేశించారు. దీంతో పాటు జాతీయ రహదారులపై బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ ల ఏర్పాటు కోసం రూ.40 కోట్లు కేటాయించారు. అలాగే బస్సుల్లో రెండు కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవర్ తో పాటు ఎదురుగా వచ్చే వాహనాలను గమనించేలా చూడాలని నిర్ణయించారు. ఇప్పటికే కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత 50 బస్సులు సీజ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇంటర్ ఫలితాలపై పుకార్లు నమ్మొద్దు: BIEAP

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha