Chandrapur Tiger Attack: మహారాష్ట్ర గుంజేవాహి అటవీ ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. చంద్రపూర్ జిల్లాలో గురువారం నాడు జరిగిన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అడవిలోకి బీడీ ఆకులు కోసేందుకు వెళ్లిన నలుగురు మహిళలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా పులి దాడి చేయడంతో వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
Read also: Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ECI
Chandrapur Tiger Attack news update
భయాందోళనలో స్థానికులు: అడవికి వెళ్లాలంటే వణుకు
ఈ ఘోర ప్రమాదం తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. అడవి అంచున ఉండే గ్రామాల జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, మృతదేహాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టారు.
Chandrapur Tiger Attack: నిఘా పెట్టిన అధికారులు: పులి కోసం గాలింపు చర్యలు
ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. నలుగురిని చంపిన పులి కదలికలను కనిపెట్టడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంత నివాసితులు కొద్దిరోజుల పాటు అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. డ్రోన్లు, కెమెరాల సహాయంతో ఆ క్రూర జంతువును పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఐరోపా వ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకుంటున్న గనేరియా, సిఫిలిస్ కేసులు

