Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల  చేసిన ECI

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ECI

వార్త 2 days ago

Rajya Sabha Elections 2026: దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అత్యంత కీలకమైన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

రాబోయే జూన్ 18వ తేదీన ఈ రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజున ఓట్ల లెక్పుంపు చేపట్టి ఫలితాలను కూడా అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జూన్ 1వ తేదీన వెలువడనుంది.

Read Also :NEET UG 2026 : నీట్ పరీక్షపై ఎన్‌టీఏ క్లారిటీ.. పూర్తి పేపర్ లీక్ కాదట

ఈ దఫా దేశవ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలు, గుజరాత్‌లో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌లో 3 మరియు జార్ఖండ్ రాష్ట్రంలో 2 స్థానాల చొప్పున ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న బలాబలాల ఆధారంగా ఈ స్థానాలను భర్తీ చేయనున్నారు.

 Official Notification on June 1st

Rajya Sabha Elections 2026: ఏపీలో ఖాళీ కానున్న నాలుగు కీలక స్థానాలు

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ కోటాకు సంబంధించిన నలుగురు ప్రముఖ రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో ఈ నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు:

  • అయోధ్య రామిరెడ్డి
  • పిల్లి సుభాష్ చంద్రబోస్
  • సాన సతీష్
  • పరిమళ్ నత్వానీ

వీరి పదవీ కాలం ముగియనుండటంతో, ఏపీలోని ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ 4 స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకోనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha