Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చరణ్ - సుక్కు మూవీ అప్డేట్

చరణ్ - సుక్కు మూవీ అప్డేట్

వార్త 2 weeks ago

Ram Charan - Sukumar : 'పెద్ది' చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వర్క్ చేయనున్న సంగతి తెలిసిందే. 'RC17'గా పిలువబడుతున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దసరా పండగ సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 తేదీల మధ్యలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని భావిస్తున్నారు.

 ramcharanandsukumar

‘రంగస్థలం’ మ్యాజిక్ రిపీట్: ‘పుష్ప’ తర్వాత సుక్కు సరికొత్త ప్రాజెక్ట్!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కలయికలో వస్తున్న రెండవ సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్‌లోనే కాకుండా పాన్-ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2’ వంటి సంచలన విజయం తర్వాత సుకుమార్ తెరకెక్కించబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఆయన స్క్రిప్ట్‌ను అత్యంత పర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేశారు. సరిగ్గా ఒక ఏడాది వ్యవధిలోనే చిత్రీకరణ పూర్తి చేసి, 2027 చివరినాటికి లేదా 2028 ప్రారంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

'దాదా' కొత్త షెడ్యూల్.. షూటింగ్‌లో పాల్గొన్న బాలకృష్ణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha