Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చరిత్ర సృష్టించిన భారత్‌.. 114 పతకాలతో సరికొత్త రికార్డు

చరిత్ర సృష్టించిన భారత్‌.. 114 పతకాలతో సరికొత్త రికార్డు

వార్త 20 hrs ago

Asian Para Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరిగిన ఆసియా పారా గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు చారిత్రాత్మక ప్రదర్శనతో తమ ప్రయాణాన్ని ముగించారు.

ప్రపంచ రికార్డులు, అద్భుత విజయాలు, క్లీన్ స్వీప్‌లతో రాణించి ఏకంగా 114 పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు , 49 కాంస్య పతకాలు ఉన్నాయి. గతంలో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో భారత్ సాధించిన 108 పతకాల (తొలుత 111 పతకాలు రాగా, డోపింగ్ కారణాల వల్ల మూడు రద్దయ్యాయి) రికార్డును ఈసారి తిరగరాశారు.

Read also: Parvinder Awana: బీసిసిఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ పేసర్‌

తక్కువ మంది అథ్లెట్లు.. భారీ విజయాలు!

ఈసారి భారత బృందం ప్రదర్శన విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. గత ఎడిషన్‌లో 309 మంది అథ్లెట్లు పాల్గొనగా, ఈసారి కేవలం 168 మంది అథ్లెట్లు మాత్రమే పోటీపడ్డారు. పోటీపడిన ప్రతినిధుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, పతకాల సంఖ్య పెరగడం విశేషం.

పీ.సీ.ఐ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా స్పందన

భారత్ 100 పతకాల మార్కును దాటడంపై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (PCI) అధ్యక్షుడు దేవేంద్ర జజారియా సంతోషం వ్యక్తం చేశారు.

“114 పతకాలు సాధించడం భారత పారా క్రీడలకు గర్వకారణం. ఇది మన అథ్లెట్ల కృషి, ధైర్యం, పట్టుదలకు నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల్పించిన ప్రోత్సాహం, మద్దతు వల్లే ఈ చారిత్రాత్మక ఫలితాలు సాధ్యమయ్యాయి,” అని ఆయన పేర్కొన్నారు.

పారా బ్యాడ్మింటన్‌లో భారత ప్లేయర్ల హవా

పురుషుల సింగిల్స్ (SL3): పారాలింపిక్ ఛాంపియన్ నితీష్ కుమార్, ప్రపంచ ఛాంపియన్ ప్రమోద్ భగత్‌ను 21-18, 21-16 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, ప్రమోద్ భగత్ సిల్వర్ మెడల్ సాధించారు.

మహిళల డబుల్స్ (SL3-SU5): తులసిమతి మురుగేశన్ – మానసి గిరీష్‌చంద్ర జోషి జోడీ 21-16, 21-13 తేడాతో చైనా జంటపై గెలిచి పసిడి పతకాన్ని ముద్దాడింది.

ఇతర పతకాలు: తులసిమతి మురుగేశన్ (మహిళల సింగిల్స్ SU5) రజతం గెలవగా, నిత్య శ్రీ సుమతి శివన్ (మహిళల సింగిల్స్ SH6) కూడా రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

ఆర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో కొత్త చరిత్ర

పురుషుల రీకర్వ్ డబుల్స్‌లో హర్విందర్ సింగ్ – విజయ్ సుండి జోడీ స్వర్ణ పతకాన్ని సాధించగా, మహిళల రీకర్వ్ డబుల్స్‌లో పూజా జాత్యాన్ – భావనా చౌదరి రజతం గెలుచుకున్నారు. ఆసియా పారా గేమ్స్ చరిత్రలోనే ఈ విభాగంలో భారత్‌కు ఇది తొలి పతకం.

పురుషుల జావెలెన్ త్రో (F37/38) విభాగంలో హానీ (Haney) 60.49 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, T37 కేటగిరీలో సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశారు.

ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట.. ప్రపంచ రికార్డులతో మెరిసిన అథ్లెట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha