Mitchell Starc:ఆస్ట్రేలియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ టెస్ట్ క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే 450 వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.
దక్షిణాఫ్రికాతో సెయింట్ జార్జెస్ పార్క్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వియాన్ ముల్డర్ వికెట్‌తో స్టార్ ఈ రికార్డు అందుకున్నాడు.
Ranji Trophy: రుతురాజ్ సంచలనం.. ఏడో స్ధానంలో వచ్చి సూపర్ సెంచరీ
మెక్‌గ్రాత్ రికార్డ్ బ్రేక్
అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో అత్యంతవేగంగా(బంతుల పరంగా) 450 వికెట్ల మైలు రాయిని అందకున్న ఫాస్ట్ బౌలర్‌గా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ కేవలం 20,577 బంతుల్లో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు గ్లెన్ మెక్‌గ్రాత్ (23,474) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మెక్‌గ్రాత్ ఆల్‌టైమ్ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లు (మ్యాచ్‌ల పరంగా)
ముత్తయ్య మురళీధరన్ – 80 మ్యాచులు
రవిచంద్రన్ అశ్విన్ – 89 మ్యాచులు
అనిల్ కుంబ్లే – 93 మ్యాచులు
గ్లెన్ మెక్‌గ్రాత్ – 100 మ్యాచులు
షేన్ వార్న్ – 101 మ్యాచులు
మిచెల్ స్టార్క్ – 109 మ్యాచులు*
ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు:
షేన్ వార్న్ – 708 వికెట్లు
నాథన్ లయన్ – 573 వికెట్లు
గ్లెన్ మెక్‌గ్రాత్ – 563 వికెట్లు
మిచెల్ స్టార్క్ – 450* వికెట్లు
డెన్నిస్ లిల్లీ – 355 వికెట్లు
కివీస్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. సిరీస్ గెలుపే లక్ష్యంగా

