Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చట్ట సభల్లో మార్పు రావాలి

చట్ట సభల్లో మార్పు రావాలి

వార్త 0 months ago

Parliamentary systems : ప్ర జాస్వామ్యం పది కాలాల పాటు నిలబడాలంటే పార్ల మెంటరీ వ్యవస్థలు సద్వినియోగ పర్చుకోవాల్సిన అవసరం పార్లమెంట్లో పాల్గొనే సభ్యులకు వుంది!

అది వారి బాధ్యత కూడా! ఎందుకంటే సుమారు 18 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహి స్తున్నారు కనుక! ఇప్పటి మాటేమో కానీ ఇదివరకు ముఖ్యంగాస్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో పార్లమెంటును పవిత్ర దేవాలయంగా అభివర్ణించే వారు. కేవలం పైకి చెప్పటమే కాదు ఆచరణలో గూడా వారు పార్లమెంటును అంతే చూసేవారు! పార్లమెంటులోని ప్రతి నిధి రెండు విధాలుగా తనకు దొరికిన అవకాశాన్ని వినియో గించుకోవాలి! తన కానిస్టిట్యుయన్సీ ఓటర్లు తనను కలిసి వారి కష్ట సుఖాలతో పాటు, ఏయే సౌకర్యాలు ఆనియోజక వర్గానికి కల్పించాలి, రెండవది ఏవిధంగా ఆ విష యాలను పార్లమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి తను ప్రాతినిధ్యం వహించే ఓటర్ల న్యాయమైన కోర్కెలను తీర్చేం దుకు ప్రయత్నించగలగాలి!? ఈ రెండూ ప్రస్తుతం జరుగు తున్నాయా? ఆ విధంగా ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించే రోజులు పోయాయి! ఓటర్ల ప్రాతినిధ్యం బదులు పార్టీ ప్రాతినిధ్యమే నెరవేర్చటానికి ప్రయత్నిస్తు న్నారు. ఆ విధంగా ప్రజాస్వామ్య అసలు సిసలైన విలు వలను కాల రాస్తున్నారు! నీతులు ప్రవచించే రాజకీయ నాయకులు అవినీతి కార్యక్రమాలకే వంతపాడుతున్నారు!

 Parliamentary systems

Parliamentary systems : స్వలాభానికే ఎక్కువ సమయం

ఒకటో రెండో మంచి పనులు చేబట్టినా కేవలం అవి ప్రచా రానికి మాత్రమే వాడుకుంటున్నారు! ప్రజల లాభం ప్రక్కన పెట్టి, స్వలాభానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. చేసే చట్టాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించ లేకపోతున్నాయి! 131 రాజ్యాం గం ఎమెండెమెంట్, డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు ఆమోదంతో లోక్సభలోకి సభ్యుల సంఖ్య 550 నుంచి 853కు పెరు గుతుంది. ప్రస్తు తం మల్కాజిగిరి (తెలంగాణ) నియోజక వర్గంలో 37.8 లక్షల ఓటర్లు వున్నారు. సరాసరి లోక్ సభ సీటు 18 లక్షల మందికే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎన్ని రెట్ల సంఖ్య మల్కాజిగిరి సీట్లో ఎక్కువగా ఉందో పరిగణనలోకితీసుకొని విస్మయం చెందినా, ఏం చేసేపరిస్థితి వుంది? లక్షద్వీప్ సభ్యుడికి కేవలం 57,953మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు! ఏ పార్లమెంట్ సభ్యుడైనా కేవలంప్రజా స్వామ్య వ్యవస్థకు చూపులకు ఆభరణంగా మిగలటం వల్ల ఆశించిన ప్రయోజనాలు ఆ నియోజక వర్గానికి లభిస్తా యా? ఏ సభ్యు డికైనా సభలో డిబేట్లలో కాకుండా వేరే రూపంలో పాల్గొనే అవకాశం ప్రశ్నల సమయం, జీరోఅవర్స్ ఉంటుంది. లోక్ సభలో కాలపరిమితి ప్రకారం 20స్టార్ ప్రశ్నలకు ముఖతా జవాబులు లభిస్తాయి. 230 అన్జర్ ప్రశ్నలకు లిఖిత రూపంలో ఒక సిట్టింగ్ రోజున జవాబులు దొరుకుతాయి. ఒక సభ్యుడు రోజుకు 5 ప్రశ్నలు వేయ వచ్చు. అందులో కొన్నిటినే ఎన్నుకొని స్పీకర్ అనుమతితో జవాబులు ప్రభు త్వం ఇవ్వటం జరుగుతుంది.

స్పీకర్ దృష్టిలో వడ్డ వారికి మాత్రమే ఈ అవకాశం

ఒకవేళ 850కి సంఖ్య పెరు గుతే సభ్యుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం చాలా తక్కువ అవుతాయి! 17వ లోక్సభలో ప్రశ్నా సమయం 60 శాతం మాత్రమే వినియోగించు కున్నారు. వర్షాకాల సమావేశంలో (2026) కేవలం 1శాతం మాత్రమే ప్రశ్నా సమయం అందు బాటులోకి వచ్చింది. కేవలం 9 నిముషాలు మాత్రమే మొత్తం సెషన్లో ప్రశ్నలకు సమయం కుదిరింది. జీరో అవర్లో అర్జెంట్ విషయాల ప్రస్తావన వుం టుంది. ఈ సమ యాన్ని చాలామంది సభ్యులు వినియో గించుకొనేందుకు ప్రయత్నిస్తారు కానీ స్పీకర్ దృష్టిలో వడ్డ వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది అని అంటారు! డీలిమిటేషన్ జరు గుతే పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో ఇప్పుడే చెప్పటం కష్టం! ప్రజాస్వామ్యంలో శాసనాలు చేసే వ్యవస్థప్రత్యేకంగా రాణించాలి! ప్రజా ప్రతినిధులు, ఓటర్లు ఎన్ను కుంటేనే శాసనాలు చేసే సభలలో పాల్గొనగలరు! నిజానికి రాజ్యసభలోని సభ్యులను, రాష్ట్రాల శాసనసభ్యులే చాలా వరకు ఇండైరక్ట్గా ఎన్నుకుంటారు. వివిధ రంగాలలో ఆరి తేరిన వారిని, ప్రత్యేకంగా రాష్ట్రపతి, సమాజంలోని భిన్నవర్గాల ప్రతినిధులు గుర్తించి ప్రత్యక్ష ఎన్నికలలో రాలేని వారిని శాసనాలు చేసే సభల్లో అడుగుపెట్టటానికి నామినేట్ చేస్తారు! ఇంతకు ముందు నిజమైన అనుభవం కల్గిన వారికి విభిన్న రంగాలల్లో రాణించిన వారికి ఈ అవకాశం పక్షపాత రహితంగా లభించేది.

 Parliamentary systems

పార్టీల పెద్దల మాయమాటలకు లోబడుతున్నారు

ఇప్పుడు పార్టీలు ప్రత్యక్ష ఎన్నికలలో గెలుపొందని రాజకీయ నాయకులను, లోక్సభలో ఎక్కువ మంది అధికార సభ్యులను నింపటానికి ప్రయత్నించటం వల్ల ఇదివరకటి పారదర్శకత అనుభవజ్ఞుల గుర్తింపు, ఇప్పటి సభల్లో కనపడటం లేదు! నిజమైన మేధావుల స్తబ్దత వల్ల కుహనా మేధావులూ, మానిప్యులేటర్లు ఈ అవకాశాన్ని వీరి విగా వాడుకుంటున్నారు. ప్రజలు ఖిన్నులై చూస్తున్నారు! ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకూ గొప్ప ప్రజాస్వామ్య దేశాలుగా పేరు తెచ్చుకున్న దేశాల్లో గూడా తగ్గుతున్నాయి! దానికి కారణం ప్రజలు ఓటు విలువను సరియైన అవగా హనతో వినియోగించుకోకపోవటం వల్లనేమో! ఇదివరకు గ్రామ సీమలల్లో చదువు లేనివారే ఎక్కువగా ప్రజాస్వామ్య పరిధులను తప్పకుండా విజ్ఞతతో ప్రతినిధులను ఎన్నుకొనే వారని మిగిలిన కొద్దిమంది ఆనాటి వారు వాపోతుంటారు. ఆకర్షణ యుగంగా మారిపోయిన ఈ యుగంలో అభివృద్ధి పేరుతో, సంక్షేమం పేరుతో, టాక్సుల ద్వారా లభ్యమైన డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేస్తూ, ఎక్కువ భాగం వారి స్వీయాభివృద్ధికే వినియోగించుకుంటూ పైపైన ప్రజల అభి వృద్ధి సంక్షేమం జరుగుతున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నా రు. ఫ్రీ బీలకు లొంగుతున్న ఈనాటి ఓటర్లు ఈ మార్పును క్షుణ్ణంగా పసిగట్టలేక, పార్టీల పెద్దల మాయమాటలకు లోబడుతున్నారు! డీలిమిటేషన్ క్రమ పద్ధతిలో సౌత్ నార్త్ రాష్ట్రాల చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఉపక్రమించాలి! అంతే కాని, కేవలం సభ్యుల సంఖ్య పెంచినంత మాత్రాన సరి యైన ప్రాతినిధ్యానికి సమతుల్యత లభించినట్లు కాదు! పాలకులూ, ప్రతిపక్షాలూ చట్టసభల్లో సరియైన ప్రాతినిధ్యం అన్ని రాష్ట్రాలకూ లభించే విధంగా చర్చల ద్వారా డీలిమి టేషన్ విషయం అందరికీ ఆమోద యోగ్యంగా పరిష్కరిం చాలి! అప్పుడే చట్ట సభలు అర్థవంతంగా, ప్రయోజనకరం గా ప్రజల బాగోగులను గమనించి చట్టాలు చేయగలవు!

-రావులపాటి సీతారాంరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

ఈ నెల 30న ఖాతాల్లోకి PM కిసాన్ నిధులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha