Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఛత్తీస్‌గఢ్‌లో విషాదం : ఎలుగుబంటి దాడిలో అన్నాచెల్లెళ్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో విషాదం : ఎలుగుబంటి దాడిలో అన్నాచెల్లెళ్లు మృతి

వార్త 2 weeks ago

Tragedy in Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా నర్హర్‌పూర్ అటవీ పరిధి పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. లర్‌గావ్-మర్కటోలా ప్రాంతంలో ఎలుగుబంటి జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోగా, మరో సోదరి తీవ్రంగా గాయపడింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. గోర్సే జూరి (50), ఆమె సోదరుడు హలాల్ జూరి (45) తమ పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి వారిపై పడింది. ప్రమాదాన్ని గ్రహించిన అన్నాచెల్లెళ్లు ముందుగా తమ పిల్లలను సురక్షిత ప్రాంతంలో ఉంచి, ఆ తర్వాత ప్రాణాలకు తెగించి ఎలుగుబంటితో తలపడ్డారు.

Read Also : Youtuber Joseph Ravan: యూట్యూబర్ 'రావణ్' కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

 Tragedy in Chhattisgarh

Tragedy in Chhattisgarh : కాపాడేందుకు వచ్చిన మరో సోదరికీ తీవ్ర గాయాలు

వారి కేకలు విన్న సమీప పొలంలో పని చేస్తున్న మరో సోదరి ఖోరిన్ బాయి (43) సోదరుడిని, అక్కను రక్షించేందుకు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే ఉద్రేకంతో ఉన్న ఎలుగుబంటి ఖోరిన్ బాయిపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గోర్సే జూరి, హలాల్ జూరి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ఖోరిన్ బాయిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన పిల్ల (పిల్ల ఎలుగుబంటి) ఇన్ఫెక్షన్ వల్ల చనిపోవడంతోనే ఆ క్రోధంతో ఎలుగుబంటి బాటసారులపై, గ్రామస్తులపై దాడికి దిగిందని స్థానికుల సమాచారం ద్వారా తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నారాయణపేటలో విషాదం.. తరగతి గదిలో పాము కాటు, విద్యార్థి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha