Youtuber Joseph Ravan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో పాటు పలువురు కీలక నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైలులో ఉన్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ 'రావణ్' కస్టడీ పిటిషన్‌పై విచారణను గన్నవరం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
నిందితుడిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రాసిక్యూషన్ గురువారం తమ వాదనలను పూర్తి చేసింది.
Read Also : Minister Lokesh : పొగాకు రైతులకు ఊరట - కిలోకు రూ.10 చొప్పున ఆర్థిక సాయం : మంత్రి లోకేశ్
Hearing on YouTuber ‘Ravan’s’ custody petition adjourned.
Youtuber Joseph Ravan: సోమవారం ప్రతివాదుల అభ్యంతరాలు
పోలీసులు వినిపించిన ప్రాసిక్యూషన్ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం.. వాటిపై ప్రతివాదుల (నిందితుడి) తరఫు అభ్యంతరాలను వినేందుకు వీలుగా విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, గత నెల 28న నిందితుడి తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పటికే కోర్టుకు తన వాదనలను వినిపించారు. ప్రతివాదుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం కస్టడీపై సోమవారం తుది నిర్ణయం తీసుకోనుంది.
కీలక రాజకీయ నేతలపై వ్యాఖ్యలు చేయడంతో పాటు హిందూ మతం, ఆచారాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే తీవ్ర ఆరోపణలపై రావణ్‌పై ఏపీలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో వరుస కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను, నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
రెండు నిమిషాలు చాలు వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టేందుకు.. సీఎం

