Dailyhunt
చెల్లెలి కోసం బావను చంపిన అన్న: మిస్టరీ వీడిందిలా!

చెల్లెలి కోసం బావను చంపిన అన్న: మిస్టరీ వీడిందిలా!

వార్త 3 weeks ago

Lepakshi Crime: శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని వెంకటాపురం గ్రామంలో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తన చెల్లెలిని వేధిస్తున్నాడనే ఆగ్రహంతో, బావమరిది బావను అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.

కేవలం అనుమానంతో మొదలైన గొడవలు చివరకు హత్యకు దారితీయడం విషాదకరం.

Read Also: Vanasthalipuram Road Accident: మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

Lepakshi Crime: వేధింపులు.. అవమానాలు.. రాజు ప్రతీకారేచ్ఛ

వెంకటాపురం గ్రామానికి చెందిన రాజు సోదరి మేఘనకు, బెంగళూరు సమీపంలోని ఎలహంకకు చెందిన వినయ్ కుమార్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వినయ్ ఒక ప్రైవేట్ సంస్థను నడుపుతూ ఉండగా, మేఘన కూడా అక్కడే పనిచేసేది. అయితే, కొద్దిరోజులకే మేఘన ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వినయ్, ఆమెను శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా మేఘన అన్న రాజుకు ఫోన్ చేసి చెల్లెలి గురించి అసభ్యంగా మాట్లాడటంతో రాజు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

హంద్రీనీవా కాలువ వద్ద హత్య.. మృతదేహంపై నీళ్లు!

తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తున్నాడనే కక్షతో రాజు పక్కా స్కెచ్ వేశాడు. వినయ్‌ను నమ్మించి స్వగ్రామానికి పిలిపించి, గ్రామ సమీపంలోని హంద్రీనీవా (Handri Neeva) కాలువ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ వినయ్‌ను దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని, బైక్‌ను కాలువలోనే పడేసి పరారయ్యాడు. అయితే కొద్ది రోజుల తర్వాత కాలువలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 Lepakshi Murder Case

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.కాగా ఇదే సమయంలో వినయ్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, కాలువలో లభించిన మృతదేహం వినయ్‌దేనని నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కాల్ డేటాను పరిశీలించగా, చివరిసారిగా రాజే వినయ్‌ను సంప్రదించినట్లు బయటపడింది. దీంతో రాజును అదుపులోకి తీసుకుని విచారించగా, తన చెల్లెలిపై జరిగిన వేధింపుల కారణంగా కోపంతోనే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మౌనిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha