Dailyhunt
మౌనిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్

మౌనిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్

వార్త 3 weeks ago

Vizag Mounika Murder Case: గాజువాక మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. తొలుత తన ఫ్లాట్‌లోనే హత్య జరిగినట్లు నమ్మించిన రవీంద్ర, అసలు మౌనికను తన స్నేహితుడి ఇంట్లో అంతమొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మార్చి 30న స్నేహితుడి నివాసంలోనే ఈ ఘాతుకానికి పాల్పడి, అనంతరం మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి తన ఇంటికి తరలించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది. తన ఇంటికి మౌనిక అసలు రాలేదని తేలడంతో రవీంద్ర గుట్టు రట్టయింది.

Read Also:Begumpet:ట్రైనీ పైలెట్‌పై ఇన్‌స్ట్రక్టర్ అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్!

 Mounika Murder Case updates

Vizag Mounika Murder Case: శరీర భాగాలు ఫ్రిజ్‌లో.. అత్యంత క్రూరంగా ముక్కలు చేసి..

నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్ర, అత్యంత పాశవికంగా మౌనిక శరీరాన్ని మూడు ముక్కలుగా చేశాడు. కొన్ని శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచగా, మరికొన్ని భాగాలను గోనె సంచిలో కట్టి మంచం కింద పెట్టెలో దాచిపెట్టాడు. తల భాగం, కాళ్లు, చెప్పులు, సిమ్ కార్డును సూట్ కేసులో పెట్టి దారపాలెంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశాడు. రవీంద్ర తన ఫ్లాట్‌లోని గదిని శుభ్రంచేసి పర్‌ఫ్యూమ్‌ కొట్టాడు. మౌనిక తన వద్ద నుంచి మూడున్నర లక్షల రూపాయలు తీసుకుందని పోలీసులతో రవీంద్ర చెప్పాడు. తరచూ డబ్బుల కోసం వేధిస్తోందని తెలిపాడు. ఈ కారణంగానే ఆమెను అంతమొందించినట్లు చెప్పాడు. ఇదే కారణమా? ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్న క్రమంలో తాజాగా ఈ ట్విస్ట్ బయటపడింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha