The welfare of handloom weavers : చేనేత కార్మికుల సంక్షేమం మరియు వారి ఆర్థికాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్పష్టం చేశారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం మంత్రులు అధికారికంగా ప్రారంభించారు. ప్రదర్శన ప్రారంభం అనంతరం మంత్రులు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 100కు పైగా చేనేత స్టాల్స్‌ను సందర్శించి, చేనేత కళాకారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను మరియు వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలను అందజేసి, వారిని ఘనంగా సత్కరించారు.
The welfare of handloom weavers
The welfare of handloom weavers : ఆగస్టు 16 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన
ఈ చేనేత వస్త్ర ప్రదర్శన నేటి నుంచి (ఆగస్టు 7) ఈ నెల 16వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని మంత్రులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రదర్శనను సందర్శించి, తమకు కావలసిన చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా నేతన్నలకు మద్దతుగా నిలవాలని మరియు వారిని ప్రోత్సహించాలని మంత్రులు పిలుపునిచ్చారు.

