Karimnagar Crime: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో తీవ్ర శోకసంద్రాన్ని నింపిన ఘటన చోటుచేసుకున్నది. బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చి, లైన్‌లో నిల్చున్న ఒక రైతు గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Read Also :Tragedy in Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో విషాదం : ఎలుగుబంటి దాడిలో అన్నాచెల్లెళ్లు మృతి
Karimnagar Crime: ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు

జంగపల్లి గ్రామానికి చెందిన హనుమండ్ల బాలయ్య (55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అవసరాల నిమిత్తం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు బాలయ్య గురువారం మధ్యాహ్నం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖకు వెళ్లాడు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు లైన్‌లో నిల్చున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. బాలయ్య కుప్పకూలడం చూసిన వెంటనే స్థానికులు, ఇతర ఖాతాదారులు ఆయనను కాపాడేందుకు, ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు విడిచాడు. కళ్లముందే రైతు కుప్పకూలి మృతిచెందడంతో బ్యాంకు సిబ్బంది, తోటి ఖాతాదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడికి భార్య కనకవ్వ ఉంది. పిల్లలు లేని ఈ కుటుంబంలో యజమాని అకస్మాత్తుగా మరణించడంతో జంగపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

