Pedda Shankarampet: చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దశంకరంపేటలో చేనేత కార్మికులు పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మార్కండేయ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో నేతన్నల ఆకలి చావులు లేకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.
The government must support handloom weavers - Vallakati Raj Kumar
పద్మశాలి కార్పొరేషన్ ద్వారా చేనేత వృత్తితో పాటు ఇతర వృత్తులు చేసుకుంటున్న పద్మశాలీలకు కూడా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారని, తెలంగాణలోనూ ప్రతి చేనేత కార్మికుడికి ఇదే తరహాలో ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు, పద్మశాలీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.
Pedda Shankarampet: కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్మికులు
ఈకార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేకల జయరాములు, మండల అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మహంకాళి కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు జంగం రాములు, గుజ్జరి సంగమేశ్వర్, దశ్వంత్, కోటగిరి రమేష్,అనిల్ డాక్టర్, ఉపేందర్, జంగం రాఘవులు, సీహెచ్ నవీన్, సంతోష్‌కుమార్, నీలకంటి విట్టల్, పడాల రవి తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల నుంచి చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ట్రైనీ ఐపీఎస్‌కు సీపీ సజ్జనార్ షాక్: 5 గంటల పాటు సుదీర్ఘ విచారణ!

