Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెన్నై వీధుల్లో సీఎస్‌కే స్టార్లు: ఆటోలో షికారు.. పిల్లలతో గల్లీ క్రికెట్

చెన్నై వీధుల్లో సీఎస్‌కే స్టార్లు: ఆటోలో షికారు.. పిల్లలతో గల్లీ క్రికెట్

వార్త 2 weeks ago

CSK Players Chennai: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే కేవలం ఒక టీమ్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. తాజాగా ఈ టీమ్‌కు చెందిన యువ విదేశీ స్టార్లు డెవాల్డ్ బ్రెవిస్, నూర్ అహ్మద్ చెన్నై నగరంలో చేసిన సందడి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

స్టార్ క్రికెటర్లు అనే హంగులు ప్రదర్శించకుండా, వీరు సామాన్యుల్లా చెన్నై వీధుల్లో తిరగడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Read Also:LSG vs RCB: బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

 Dewald Brevis Auto Ride

ఆటోలో ‘లోకల్’ ప్రయాణం

షెడ్యూల్ మధ్యలో దొరికిన ఖాళీ సమయాన్ని ఈ ఇద్దరు ప్లేయర్స్ వెరైటీగా ప్లాన్ చేశారు. ఏసీ కార్లను వదిలేసి, చెన్నైకి సింబాలిక్‌గా నిలిచే ఆటో రిక్షాలో ప్రయాణించారు. రోడ్డుపై వెళ్తున్న తమ అభిమాన ఆటగాళ్లను ఆటోలో చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ‘లోకల్’ టూర్ ద్వారా వారు చెన్నై కల్చర్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం ఆటో రైడ్‌తోనే ఆగిపోకుండా, వీరు ఒక స్థానిక గ్రౌండ్‌లోకి వెళ్లారు. అక్కడ క్రికెట్ ఆడుతున్న చిన్నారులను చూసి వారితో కలిసి సరదాగా బ్యాట్ పట్టారు.చిన్నారులు బౌలింగ్ చేయగా.. బ్రెవిస్ షాట్లు ఆడి అలరించారు. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్లతో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకునేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కోహ్లీ సలహానే అస్త్రంగా మార్చిన ప్రిన్స్ యాదవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha