Prince Yadav: ఐపీఎల్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB),లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరగడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే, ఈ వికెట్ తీసిన లక్నో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ మ్యాచ్ తర్వాత వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also:Yuzvendra Chahal: విమానంలో వేపింగ్ చేస్తూ దొరికిపోయిన చాహల్? వైరల్ అవుతున్న వీడియో!
9 ఏళ్ల తర్వాత తొలిసారి..
లక్ష్య చేధనలో (Run Chase) విరాట్ కోహ్లీ సున్నాకే అవుట్ కావడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఏకనా స్టేడియంలో ప్రిన్స్ యాదవ్ సంధించిన 140.4 కిలోమీటర్ల వేగవంతమైన ఇన్‌స్వింగర్‌కు కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Prince Yadav dismisses Virat Kohli
Prince Yadav: గురువు సలహానే శిష్యుడి ఆయుధం!
మ్యాచ్ అనంతరం ప్రిన్స్ యాదవ్ మాట్లాడుతూ, ఈ వికెట్ తీయడంలో కోహ్లీ ఇచ్చిన సలహానే తనకు తోడ్పడిందని వెల్లడించాడు.”గత మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ భయ్యా నాతో మాట్లాడారు. పిచ్‌పై బంతి సీమ్ అవుతున్నప్పుడు, లెంగ్త్‌ను మార్చకుండా ఒకే లెంగ్త్‌లో స్థిరంగా బౌలింగ్ చేయాలని ఆయనే నాకు సలహా ఇచ్చారు. ఈ రోజు అదే సూత్రాన్ని పాటించాను. ఆయన చెప్పిన లెంగ్త్‌లోనే బంతిని సంధించి వికెట్ తీశాను” అని ప్రిన్స్ పేర్కొన్నాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

