CSK vs MI LIVE Updates: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) శనివారం చెన్నై వేదికగా తలపడుతున్నాయి.
ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారీ స్కోరు సాధించి దానిని కాపాడుకోవడమే తమ లక్ష్యమని హార్దిక్ పేర్కొన్నాడు.
CSK vs MI LIVE Updates: ముంబై జట్టులో కీలక మార్పులు
ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ ఒక కొత్త ప్రయోగానికి తెరలేపింది. యువ స్పిన్నర్ రఘు శర్మ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేస్తుండగా, క్రిష్ భగత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముంబైకి ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబైకి ఇది ‘మస్ట్ విన్’ గేమ్.
CSK vs MI Live Score
చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఇరు జట్లు
రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓడిపోతే చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. మరోవైపు, స్టార్ ప్లేయర్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల ఫామ్ మరియు పునరాగమనం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

