Vaibhav Suryavanshi: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ, చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన వివాదం ముసురుకుంది.
అతనిని ఐపీఎల్ ఆడించడం చట్టవిరుద్ధమని ఒక సామాజిక కార్యకర్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.
Read Also: Abhishek Sharma: కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ ప్రత్యేక పూజలు
Vaibhav Suryavanshi: వివాదం ఏంటి?
రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన ఈ యువ సంచలనంపై ఒక సామాజిక కార్యకర్త తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “13 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడించడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది. ఇది బాలల హక్కుల ఉల్లంఘన. తక్షణమే వైభవ్ ని ఇంటికి పంపించి, అతని చదువుపై దృష్టి పెట్టేలా చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రాజస్థాన్ యాజమాన్యం దీనిని పట్టించుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారి తీసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
రిటైర్మెంట్ వార్తలపై మిచెల్ స్టార్క్ క్లారిటీ.. ఆ పుకార్లు వింటే వింతగా ఉంది అంటూ వ్యాఖ్య

