Dailyhunt
చెపాక్‌లో చెన్నై 'సూపర్' ఫైట్.. పంజాబ్‌తో పోరులో బోణీ కొట్టేనా?

చెపాక్‌లో చెన్నై 'సూపర్' ఫైట్.. పంజాబ్‌తో పోరులో బోణీ కొట్టేనా?

వార్త 2 weeks ago

CSK vs PBKS: ఐపీఎల్ 2026 (IPL 2026)లో భాగంగా ఈరోజు ఒక రసవత్తర పోరుకు తెరలేవనుంది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పటిష్టమైన పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి.

గత మ్యాచ్‌లో ఓడిన చెన్నై, ఈసారి తన హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది.

Read Also:KKR Live Score Updates:6 ఓవర్లకే 3 వికెట్లు అవుట్..74/3

CSK vs PBKS: ముఖాముఖి పోరు (Head-to-Head Stats)

చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకు సిఎస్‌కే. పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైన చెన్నై, ఇప్పుడు తన కోటలో పంజాబ్‌ను కట్టడి చేయాలని చూస్తోంది. మరోవైపు, గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ అదే ఊపులో ఉంది.

 CSK vs PBKS IPL 2026 Match Preview

ఈ సీజన్‌లో రూ.18 కోట్లకు ట్రేడ్ ద్వారా చెన్నైలోకి వచ్చిన సంజు శాంసన్, మొదటి మ్యాచ్‌లో కేవలం 6 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. ఎంఎస్ ధోనీ గాయం కారణంగా అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో, సంజు తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జట్టును ఆదుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రూ.14.20 కోట్ల భారీ ధరకు అమ్ముడైన ఈ 19 ఏళ్ల యువ ఆటగాడైన కార్తీక్ శర్మ.. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 18 పరుగులు చేసి కొంత ఆకట్టుకున్నాడు.

ధోనీ లేని లోటును భర్తీ చేసే సత్తా ఇతనికి ఉందని మేనేజ్‌మెంట్ గట్టిగా నమ్ముతోంది. గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమైన డెవాల్డ్ బ్రెవిస్, ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ తన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మంచి జోరు మీదుంది. అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. చేపాక్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి, ఇరు జట్ల స్పిన్నర్లు ఇక్కడ కీలక పాత్ర పోషించనున్నారు. మరి ఈ మ్యాచులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha