Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతు

చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతు

వార్త 3 weeks ago

Godavari River Missing Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో ప్రవహిస్తున్న గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజన మహిళలు ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో మునిగి గల్లంతయ్యారు.

Read Also:SC : అత్యాచార బాధితురాలికి చికిత్స నిరాకరించిన ఘజియాబాద్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రమాదం జరిగింది ఎలా?

అధికారిక వర్గాలు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరం జిల్లా పరిధిలోని గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజన మహిళలు శనివారం రోజువారీ జీవనోపాధిలో భాగంగా గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే నదిలో నీటి మట్టం, ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా ఎక్కువగా ఉండటంతో వారు నియంత్రణ కోల్పోయి నదీ గర్భంలోకి కొట్టుకుపోయారు.

Godavari River Missing Case:రంగంలోకి పోలీసులు.. ముమ్మరంగా గాలింపు చర్యలు

మహిళలు నీటిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన తీర ప్రాంత వాసులు వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఎటపాక పోలీసులు, అగ్నిమాపక మరియు రెస్క్యూ సిబ్బందితో కలిసి యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో ప్రత్యేక పడవలను రంగంలోకి దించి నదిలో గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన నివాసితులుగా అధికారులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు గోదావరి నదిలో గల్లంతవడంతో గొమ్ముకొత్తగూడెం గ్రామంలో తీవ్ర ఉత్కంఠ, ఆందోళనకర వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు నదీ తీరానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

గుంటూరులో అమానుషం.. మహిళను వివస్త్రను చేసి అవమాన పరిచిన టీడీపీ నేత కుటుంబం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha