Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా మరియు కెప్టెన్ రిషభ్ పంత్ మధ్య జరిగిన సంభాషణపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి గోయెంకా స్వయంగా తెరదించారు.
తనను ఒక “పంచింగ్ బ్యాగ్”లా వాడుకుంటున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also:RCB vs DC: బెంగళూరులో మ్యాచ్.. మెట్రో, బీఎంటీసీ ప్రత్యేక సర్వీసులు
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఓటమి పాలైన ప్రతిసారీ, ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా లక్ష్యంగా విమర్శలు రావడం రివాజుగా మారింది. తాజాగా కెప్టెన్ రిషభ్ పంత్‌తో ఆయన మైదానంలో మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడంతో, గోయెంకా మళ్ళీ కెప్టెన్‌ను మందలిస్తున్నారనే చర్చ మొదలైంది. దీనిపై ఆయన స్పందిస్తూ సోషల్ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పంత్‌ను మందలించలేదు
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గోయెంకా తీవ్రంగా ఖండించారు. “రిషభ్ లాంటి టాప్ ప్లేయర్‌ను మందలించే ధైర్యం ఎవరికీ ఉండదు. అది సాధ్యం కూడా కాదు. కానీ నేను కేవలం చేతులు కదిపినా అది బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. వ్యూస్ కోసం నన్ను ఒక సులభమైన పంచింగ్ బ్యాగ్‌గా వాడుకుంటున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Sanjiv Goenka on Rishabh Pant conversation
Sanjiv Goenka: చేతులు కట్టుకుని మాట్లాడతా!
తన బాడీ లాంగ్వేజ్ వల్ల తలెత్తుతున్న అపార్థాలపై స్పందిస్తూ ఆయన ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “నేను మాట్లాడేటప్పుడు సహజంగానే చేతులు కదుపుతాను. కానీ అది జాతీయ స్థాయిలో హెడ్‌లైన్‌గా మారుతోంది. ఇక నుంచి ఈ అపార్థాలను తప్పించుకోవడానికి చేతులు వెనక్కి పెట్టుకుని మాట్లాడటం నేర్చుకుంటున్నాను” అని సరదాగా వ్యాఖ్యానించారు.
నా పాత్ర కోచింగ్ ఇవ్వడం కాదు
జట్టు అంతర్గత విషయాల్లో తన జోక్యంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. “నేను ప్రొఫెషనల్ క్రికెటర్‌ను కాదు. కాబట్టి ఆటగాళ్లకు ఎలా ఆడాలో చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. సాంకేతిక అంశాలను చూసుకోవడానికి మాకు నిపుణుల బృందం ఉంది. యజమానిగా నా బాధ్యత జట్టుకు మద్దతు ఇవ్వడమే” అని గోయెంకా స్పష్టం చేశారు.డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా సానుకూలంగా ఉందని, బయట వినిపించే కథనాల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

