Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వంద వికెట్ల క్లబ్‌లో అర్ష్‌దీప్

వంద వికెట్ల క్లబ్‌లో అర్ష్‌దీప్

వార్త 2 months ago

Arshdeep Singh: పంజాబ్ కింగ్స్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్ సింగ్, ఐపీఎల్ కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన సాధించిన ఈ 'శతక' వికెట్ల రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also:Virat Kohli: మళ్ళీ అల్గారిథమ్ మహిమేనా? ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోకు కోహ్లీ లైక్

Arshdeep Singh: రికార్డుల వేటలో అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్ కింగ్స్ పేస్ గుర్రం అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ర్యాన్ రికెల్టన్ వికెట్ పడగొట్టడం ద్వారా ఆయన ఈ 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు.

పంజాబ్ కింగ్స్ తరపున తొలి పేసర్

ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున 100 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా అర్ష్‌దీప్ చరిత్ర సృష్టించారు. 2019లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఆయన పంజాబ్ జట్టుకే ఆడుతుండటం విశేషం.

ఎడమ చేతి వాటం పేసర్ల జాబితాలో..

ఐపీఎల్‌లో వంద వికెట్లు పడగొట్టిన 5వ ఎడమ చేతి వాటం పేసర్‌గా, అలాగే 4వ భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచారు. ఆయన కంటే ముందు ఈ ఘనత సాధించిన దిగ్గజాలు వీరే:

  1. ట్రెంట్ బౌల్ట్
  2. జహీర్ ఖాన్
  3. ఆశిష్ నెహ్రా
  4. జయదేవ్ ఉనాద్కత్

అర్ష్‌దీప్ ఐపీఎల్ గణాంకాలు (IPL Stats)

ఐపీఎల్ అరంగ్రేటం నుంచి అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరుపుననే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతడు 87 మ్యాచ్‌లు ఆడాడు. 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన ఉండగా ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక పంజాబ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టీ20 సిరీస్‌కు సై: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ తొలి పోరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha