Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెవిరెడ్డికి చుక్కలు చూపించిన MLA సతీమణి సుధారెడ్డి

చెవిరెడ్డికి చుక్కలు చూపించిన MLA సతీమణి సుధారెడ్డి

వార్త 2 weeks ago

Chevi Reddy : ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరుపతిలోని మంగళం సప్తగిరి కాలనీ పోలింగ్ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఎదురుపడ్డారు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన సంభాషణ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సుధారెడ్డి చెవిరెడ్డిని కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామం అక్కడున్న నాయకులు, కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది.

‘ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం’.. సుధారెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు!

చెవిరెడ్డితో మాట్లాడిన సందర్భంగా సుధారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే తాము కూడా అక్కడికి వస్తామని, ‘మా అన్నతోనే ఉంటాం’ అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ నాయకులను ఇబ్బందులకు గురిచేయవద్దని, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో చెవిరెడ్డి, సుధారెడ్డి మధ్య జరిగిన మాటల సంభాషణ స్థానికంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సుధారెడ్డి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఏపీ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం.. బోటులో 4 మృతదేహాలు లభ్యం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha