Duronto Express Toilet Cleaning: లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (LTT) ముంబై నుండి ఎర్నాకుళం వెళ్లే 12223 దురంతో ఎక్స్‌ప్రెస్ (Duronto Express) ఫస్ట్ ఏసీ కోచ్‌లో ఈ అక్రమం చోటుచేసుకుంది.
'ట్రూత్ ఆన్ ట్రాక్' అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో.. క్యాటరింగ్ సిబ్బంది రైలు టాయిలెట్ లోపల ఉండి ప్రయాణికులకు భోజనం వడ్డించే గిన్నెలు, స్పూన్లు (కట్లరీ) కడుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ టాయిలెట్ నేలపైనే ఆహార పాత్రలు ఉంచిన బాస్కెట్ కూడా ఉంది.
నిలదీసిన ప్రయాణికుడు – సిబ్బంది నిర్లక్ష్య సమాధానం
Duronto Express Train Toilet Utensils Cleaning Video IRCTC FSSAI Notice Schedule 4 Violation
ఈ ఘోరాన్ని గమనించిన ఒక ప్రయాణికుడు తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తూ సదరు సిబ్బందిని గట్టిగా నిలదీశాడు. “ఏం చేస్తున్నారు? పాత్రలు శుభ్రం చేయడానికి ఇది సరైన ప్రదేశమా?” అని ప్రశ్నించగా, లోపల ఉన్న వ్యక్తి మౌనంగా ఉండిపోయాడు. బయట ఉన్న క్యాటరింగ్ అటెండెంట్‌ను అడగ్గా.. “నేను ఇప్పుడే చూశాను, సాధారణంగా పాత్రలు కడిగేవారు అక్కడే కడుగుతారు” అంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. ప్రీమియం క్లాస్ టికెట్లకు వేల రూపాయలు చెల్లించి ప్రయాణించే తమకు ఇలాంటి మురికి కూపంలో కడిగిన పాత్రల్లో భోజనం పెడతారా అని నెటిజన్లు రైల్వే శాఖపై మండిపడుతున్నారు.
Duronto Express Toilet Cleaning: FSSAI నోటీసులు – నిబంధనల తీవ్ర ఉల్లంఘన:
వీడియో వైరల్ కావడంపై సుమోటోగా స్పందించిన FSSAI, ఈ చర్య ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్-2011లోని షెడ్యూల్-4 నిబంధనలకు సంపూర్ణ విరుద్ధమని తేల్చింది.
- ఆహార పదార్థాలు, వాటికి ఉపయోగించే పాత్రలు అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడం ఏ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కైనా ప్రాథమిక బాధ్యత.
- ఆహారం కలుషితం కాకుండా (Food Contamination) చూసే కనీస నియమాలను ఇక్కడ పూర్తిగా తుంగలో తొక్కారు.
- ఈ ఘటనపై తక్షణమే వాస్తవ నివేదిక (Fact-finding report) సమర్పించాలని FSSAI తన నోటీసులో IRCTCని ఆదేశించింది.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినప్పటికీ, IRCTC యాజమాన్యం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
ఇంట్లో ఏసీ పేలి సీసీఐ తొలి ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దుర్మరణం!

