Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హమీర్‌పూర్ జిల్లాలో అర్ధరాత్రి మృత్యుఘోష..రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం!

హమీర్‌పూర్ జిల్లాలో అర్ధరాత్రి మృత్యుఘోష..రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం!

వార్త 2 weeks ago

Hamirpur Bridge Collapse News: హమీర్‌పూర్ జిల్లా కురారా పరిధిలోని బెట్వా నదిపై (Betwa River) మోరాకందర్ పర్సాని నుండి నైతి గ్రామం వరకు ఒక భారీ వంతెన నిర్మాణం జరుగుతోంది.

గురువారం అర్ధరాత్రి దాటాక, సుమారు 2:00 గంటల సమయంలో ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా తీవ్రమైన గాలివాన మొదలైంది. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ, ఆ సమయంలో అక్కడ వంతెనకు సంబంధించిన శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. గాలి ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెన శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కార్మికులు శిథిలాల కింద నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Read also:Dhanendra Kumar IAS Death:ఇంట్లో ఏసీ పేలి సీసీఐ తొలి ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దుర్మరణం!

రంగంలోకి SDRF.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

 6 Workers Killed as Under-Construction Bridge Collapse in Hamirpur

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగించి, కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఐదుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీసి, వారి స్వస్థలాల వివరాలను సేకరిస్తున్నారు. శ్లాబ్ కింద మరో ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో వారిని ప్రాణాలతో కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోంది.

Hamirpur Bridge Collapse News:నిర్మాణ నాణ్యతపై అనుమానాలు

తీవ్రమైన గాలివాన వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ, కేవలం గాలివానకే నిర్మాణంలో ఉన్న వంతెన శ్లాబ్ కూలిపోవడంపై స్థానికులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

హత్యకు గురైందనుకున్న యువతి సజీవంగా ప్రత్యక్షం..ఎక్కడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha