Bejjanki Chain Snatching: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో అర్ధరాత్రి వేళ దొంగలు రెచ్చిపోయారు. ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని వరుస దాడులకు తెగబడటమే కాకుండా..
వారి మెడల్లోని బంగారు పుస్తెల తాళ్లను లాక్కెళ్లిన ఉదంతాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
మండల పరిధిలోని చిలాపూర్, రేగులపల్లి గ్రామాల్లో ఒకే రాత్రి గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వేసవి తీవ్రత కారణంగా ఇళ్ల బయట, అరుగులపై నిద్రిస్తున్న మహిళల బలహీనతను ఆసరాగా చేసుకుని ఈ ఘాతుకాలకు ఒడిగట్టారు.
చిలాపూర్‌లో ఇద్దరు మహిళలపై అటాక్!
దుండగులు మొదట చిలాపూర్ గ్రామాన్ని ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన కొత్త తారవ్వ అనే మహిళ తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు తాడును తెంచేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. దీనితో దొంగలు అక్కడ ఏమీ దొరకకుండానే పారిపోయారు.
కానీ, అదే గ్రామానికి చెందిన తడిమేలపల్లి లక్ష్మి (నిశాని మణెమ్మ) విషయంలో దొంగలు సఫలమయ్యారు. ఆమె ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి, ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. ఈ పెనుగులాటలో లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితులు ఇద్దరు వ్యక్తులుగా ఉండి, పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు స్థానికులు గమనించారు.
రేగులపల్లిలోనూ అదే సీన్..
చిలాపూర్‌లో దొంగతనం జరిగిన కొద్దిసేపటికే పక్కనే ఉన్న రేగులపల్లి గ్రామంలోనూ దుండగులు హల్‌చల్ చేశారు. గ్రామానికి చెందిన భూపతి లాస్య ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో అదను చూసి చొరబడిన దొంగ.. ఆమె మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును క్షణాల వ్యవధిలో లాక్కొని చీకట్లోకి పారిపోయాడు. బాధితురాలి కేకలతో కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల ఎంత వెతికినప్పటికీ దుండగుల ఆచూకీ లభించలేదు.
Police patrolling vehicle moving around the villages at night to ensure women safety and prevent thefts
Bejjanki Chain Snatching: రంగంలోకి ప్రత్యేక బృందాలు: ఎస్సై తోట తిరుపతి
వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో బెజ్జంకి పోలీసులు అలర్ట్ అయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాలను పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను (Special Teams) రంగంలోకి దించినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ దొంగల కదలికలను ట్రాక్ చేస్తున్నామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

