Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీసులకు సవాలుగా మారిన భారీ చోరీ!

పోలీసులకు సవాలుగా మారిన భారీ చోరీ!

వార్త 3 months ago

Medak Chilapalli Mega Robbery: మెదక్ జిల్లాలో దొంగలు ఘోరమైన బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్న ఒకే గ్రామాన్ని టార్గెట్ చేస్తూ..

ఒకే రాత్రి ఏకంగా ఐదు ఇళ్లలో తాళాలు పగులగొట్టి కోట్లాది రూపాయల విలువైన సొత్తును దోచుకెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది.

పెద్ద శంకరంపేట: జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామం గురువారం అర్ధరాత్రి దొంగల ముఠా ధాటికి వణికిపోయింది. గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లను పక్కా స్కెచ్‌తో ఎంచుకున్న దొంగలు, అర్ధరాత్రి వేళ ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి భారీ దోపిడీకి పాల్పడ్డారు.

ఒక్క ఇంట్లోనే 110 తులాల బంగారం మాయం!

ఈ ఐదు ఇళ్ల చోరీల్లో.. గ్రామానికి చెందిన రాయిని రాములు అనే వ్యక్తి ఇంట్లోనే దొంగలు అత్యంత భారీగా లూటీ చేశారు. ఆయన ఇంట్లో దాచిన 110 తులాల బంగారం, రెండున్నర కేజీల వెండిని దుండగులు ఎత్తుకెళ్లారు. దీనితో పాటు మరో బాధితుడు ఏసిరెడ్డి మాణిక్ రెడ్డికి చెందిన ఇంట్లో చొరబడి మూడు తులాల బంగారు నగలను అపహరించారు. మొత్తంగా దొంగిలించిన ఈ సొమ్ము విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పోలీసులకు సవాల్‌గా మారిన 'అంతరాష్ట్ర ముఠా' స్కెచ్!

ఒకే రాత్రి, ఒకే గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో వ్యూహాత్మకంగా సాగిన ఈ భారీ చోరీ ఉదంతం జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళికతో వచ్చిన అంతరాష్ట్ర దొంగల ముఠా (Inter-State Gang) హస్తం ఉన్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ దారుణమైన దోపిడీ ఇప్పుడు పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా నిలిచింది.

 Biggest theft in Medak history.. 110 tola gold stolen from a single house.. Special police teams enter the field

Medak Chilapalli Mega Robbery: రంగంలోకి ప్రత్యేక బృందాలు.. సిసిటివిల జల్లెడ!

ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. నిందితుల వేట కోసం ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేశారు. పెద్ద శంకరంపేట మండలంలోని మరియు జాతీయ రహదారి పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పోలీసులు ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు. పాత నేరస్థుల రికార్డులను పరిశీలించడంతో పాటు, సరిహద్దు రాష్ట్రాల ముఠాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఒకే రాత్రి జరిగిన ఈ భారీ దోపిడీతో చీలపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

దొంగల బీభత్సం: 100 తులాల బంగారం, కిలో వెండి అపహరణ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha