Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్నారి మిస్సింగ్ కేసుపై హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

చిన్నారి మిస్సింగ్ కేసుపై హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

వార్త 1 week ago

AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తునిలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఉదంతంపై హైకోర్టు ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చిన్నారి ఆచూకీని వీలైనంత త్వరగా కనిపెట్టేందుకు రాష్ట్ర పోలీసు శాఖ మరింత చురుగ్గా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్‌ను స్పష్టంగా ఆదేశించింది.

ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ & ప్రభుత్వ వాదనలు

ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా ఈ అంశం కోర్టు ముందుకు వచ్చింది. విచారణలో భాగంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో మహిళలు మరియు పిల్లల భద్రతకు సంబంధించి పలు కీలక వివరాలను న్యాయస్థానానికి వివరించారు.

AP High Court: రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసుల గణాంకాలు

గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,508 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వీటిలో ఇప్పటివరకు 4,284 మంది ఆచూకీని విజయవంతంగా కనుగొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మిగిలిన కేసులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అన్ని అదృశ్యాల కేసులకు సంబంధించి పురోగతి సాధిస్తామని కోర్టుకు వివరించారు.

Epaper: epaper.vaartha.com

నేడు పున్నమిఘాట్‌కు రానున్న రాష్ట్రపతి ముర్ము

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha