Puducherry Elections: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గురువారం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఒక అరుదైన దృశ్యం ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇక్కడి VOC ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద 'నీలా' (Nila) అనే హ్యూమనాయిడ్ రోబో ఓటర్లకు స్వాగతం పలుకుతోంది.
Read also: Yanam Elections 2026: యానాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ
Puducherry Elections: స్వీట్లు పంచుతూ.. ముచ్చటిస్తూ..
సాంప్రదాయబద్ధంగా చీర ధరించి, పూల ట్రే పట్టుకున్న ఈ రోబో, ఓటు వేయడానికి వస్తున్న వారికి స్వీట్లు పంచుతూ అభినందనలు తెలుపుతోంది. కేవలం స్వాగతం పలకడమే కాకుండా, ఈ రోబో ఓటర్లతో ఇంగ్లీష్ మరియు తమిళ భాషల్లో మాట్లాడుతోంది. 'రోబో మిర్రర్' అనే సంస్థ రూపొందించిన ఈ రోబోను ఓటర్లలో ఉత్సాహం నింపేందుకు, ముఖ్యంగా యువతను ప్రోత్సహించేందుకు ఎన్నికల అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు.
టెక్నాలజీ సాయంతో ఓటర్లకు ఇలాంటి అనుభూతిని అందించడం పుదుచ్చేరి ఎన్నికల్లో ఇదే తొలిసారి కావడంతో, ఓటర్లు ఈ 'నీలా' రోబోతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

