Yanam Elections 2026: పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నియోజకవర్గం యానాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Read Also:EPFO: పీఎఫ్ యూజర్లకు షాక్.. ఆ ఒక్క డేట్ తప్పుంటే డబ్బులు రావు!
Yanam Elections 2026: రంగంలో 13 మంది అభ్యర్థులు.. త్రిముఖ పోరు?
ఈసారి యానాం బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది.
- మల్లాడి కృష్ణారావు (N.R. Congress): మాజీ మంత్రి మరియు సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు ఎన్.ఆర్. కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు.
- గొల్లపల్లి అశోక్ (Congress): సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్లపల్లి అశోక్ కాంగ్రెస్ తరపున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
- తోట రాజు (TVK Party): దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున తోట రాజు పోటీలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
Yanam Assembly Election Polling
ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు
యానాం నియోజకవర్గంలో మొత్తం 37,972 మంది ఓటర్లు తమ ప్రతినిధిని ఎన్నుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 42 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.13 పోలింగ్ కేంద్రాలను ‘సమస్యాత్మకమైనవి’ (Vulnerable) గా గుర్తించి, అక్కడ అదనపు బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.పారదర్శకత కోసం కీలక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
ఉత్కంఠ రేపుతున్న ఎన్నిక
గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చిన యానాంలో, ఈసారి విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మల్లాడి కృష్ణారావు తన పట్టును నిలబెట్టుకుంటారా లేక గొల్లపల్లి అశోక్ రెండోసారి విజయం సాధిస్తారా? అన్నది వేచి చూడాలి. టీవీకే పార్టీ ఎంట్రీతో ఓట్ల చీలిక ఎవరికి నష్టం కలిగిస్తుందనే చర్చ కూడా సాగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

