Dailyhunt
Chiranjeevi: 'మన శంకరవరప్రసాద్ గారు' ట్రైలర్ ఎప్పుడంటే?

Chiranjeevi: 'మన శంకరవరప్రసాద్ గారు' ట్రైలర్ ఎప్పుడంటే?

వార్త 3 months ago

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

భారీ అంచనాలు నెలకొన్న సినిమా సంక్రాంతికి ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఇప్పటికే సినిమాలో చిరంజీవి లుక్ ఫిదా చేస్తోంది. విడుదలైన మూడు పాటలు మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Read also:Pawan Kalyan: పొలిటికల్ డ్రామాగా పవన్ కొత్త సినిమా

జనవరి 4న ట్రైలర్‌ విడుదల

ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

MTV: మూతపడిన 'ఎంటీవీ' మ్యూజిక్ ఛానెల్స్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha