Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

వార్త 2 weeks ago

Chiranjeevi: టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా జరుగుతున్న అసత్య ప్రచారాలపై పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

చిరంజీవి హెల్త్ కండిషన్ క్షీణించిందంటూ తప్పుడు సమాచారంతో కూడిన మార్ఫింగ్ వీడియోలను సర్క్యులేట్ చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

 fake news on megastar chiranjeevi health

న్యాయవాది ఫిర్యాదుతో వెలుగులోకి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపురి కాలనీకి చెందిన అడ్వకేట్ రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై అధికారికంగా ఫిర్యాదు చేశారు. సదరు యూట్యూబ్ ఛానెల్ కావాలనే వ్యూస్ కోసం చిరంజీవి ఆరోగ్యంపై అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, మార్ఫింగ్ చేసిన విజువల్స్‌తో ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తరహా నిజా నిజాలు లేని కంటెంట్ సదరు సీనియర్ నటుడి వ్యక్తిగత ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉందన్నారు. తన ఫిర్యాదుకు బలమైన సాక్ష్యాలుగా ఆ ఛానెల్‌కు సంబంధించిన వీడియో లింకులు, స్క్రీన్‌షాట్‌లను ఆయన పోలీసులకు సమర్పించారు.

Read also: Ranveer Singh: చాముండేశ్వరి దేవి సన్నిధిలో రణ్‌వీర్ సింగ్ క్షమాపణలు

Chiranjeevi: కోర్టు అనుమతితో దర్యాప్తు ముమ్మరం

న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు, దీనిపై స్థానిక కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు. అనంతరం చట్టప్రకారం సదరు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ తప్పుడు ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha