Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరంజీవి డ్యుయల్ రోల్ పై క్లారిటీ!

చిరంజీవి డ్యుయల్ రోల్ పై క్లారిటీ!

వార్త 2 weeks ago

MEGA 158 : మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ (K. S. Ravindra) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ 'MEGA 158' పై టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన వార్త తెగ ప్రచారం పొందుతోంది.

ఈ చిత్రంలో చిరంజీవి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం (Dual Role) చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రూమర్లపై టాలీవుడ్ విశ్వసనీయ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ప్రస్తుతం చిరంజీవి ద్విపాత్రాభినయాలు లేదా తండ్రీకొడుకుల తరహా రొటీన్ డ్యూయల్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని ఖండించాయి. కథానుగుణంగా ఆయన సరికొత్త షేడ్ ఉన్న శక్తివంతమైన ఏకైక పాత్రలోనే కనిపించనున్నారని క్లారిటీ ఇచ్చాయి.

 chiranjeevi bobby movie mega158 shooting starts in pollachi

శరవేగంగా షూటింగ్ - అనస్వరా రాజన్ కీలక పాత్ర

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరు-బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో మలయాళ భామ అనస్వరా రాజన్ (Anaswara Rajan) మెగాస్టార్ చిరంజీవి కూతురిగా ఎంతో ప్రాధాన్యత ఉన్న కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భావోద్వేగాలు, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అధికారిక విశేషాలను త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.

'అలియాస్ రుక్మిణీ' మూవీ లాంఛ్: నాని, నితిన్ కాంబో సెన్సేషన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha