Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరు 158 టైటిల్ ను లీక్ చేసిన థమన్

చిరు 158 టైటిల్ ను లీక్ చేసిన థమన్

వార్త 2 weeks ago

Mega158: మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్, టైటిల్స్‌ను సరదాగా ముందే లీక్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో పలు చిత్రాల విషయంలో జరిగినట్లే, తాజాగా తన 158వ సినిమా టైటిల్‌ను కూడా చిరంజీవి బహిరంగంగా లీక్ చేశారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ (Mega 158) గురించి సంగీత దర్శకుడు తమన్‌తో సంభాషిస్తున్న సమయంలో ఈ సినిమా పేరు ‘కదిరి’ అని చిరంజీవి చెప్పేశారు. ‘కొరియన్ కనకరాజు’ మూవీ విజయోత్సవ వేదికపై జరిగిన ఈ ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ నెల 22న అధికారిక టైటిల్ గ్లింప్స్ విడుదల: అభిమానుల్లో గందరగోళం, ఉత్సాహం

వాస్తవానికి ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న అధికారికంగా విడుదల చేసేందుకు చిత్రబృందం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, అధికారిక ప్రకటన కంటే ముందే మెగాస్టార్ నోటి వెంట ‘కదిరి’ అనే టైటిల్ రావడం మెగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా భారీ అంచనాలను పెంచేసింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటుండటంతో, లీక్ అయిన టైటిల్‌పై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఆర్జీవీ కొత్త సినిమా.. టీ-సిరీస్ నిర్మాణంలో 'పోలీస్ కంపెనీ'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha