Philippines Passenger Ferry Fire Accident: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 134 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ప్యాసింజర్ ఫెర్రీలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 80 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి పలువురిని రక్షించాయి.
'ఎంవీ జూన్ ఆస్టర్' ఫెర్రీ మనీలా నుంచి పలావాన్ ప్రావిన్స్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కోరన్‌కు బయలుదేరింది. బుధవారం సాయంత్రం కోరన్ సమీప సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న సమయంలో నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 134 మంది ఉండగా.. వారిలో 117 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక మ్యానిఫెస్ట్‌లో నమోదైంది.
Read Also : Donald Trump: మధ్యంతర ఎన్నికల వరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Massive fire in the Philippines: 5 dead, 87 missing.
Philippines Passenger Ferry Fire Accident: ముమ్మరంగా సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ (PCG) రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పటివరకు 38 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కలిపి మొత్తం 42 మందికి పైగా సురక్షితంగా కాపాడారు. ఐదు మృతదేహాలను సముద్రం నుంచి వెలికితీశారు. ఇంకా 87 మంది ఆచూకీ లభించాల్సి ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్ గార్డ్ కెప్టెన్ నోయెమీ కాయబ్యాబ్ తెలిపారు.
ప్రమాద కారణాలపై దర్యాప్తు
నౌక పూర్తిగా మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. కాపాడిన బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
కాగ్నిజెంట్‌కు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లపై నిషేధం!

