Thief Stuck In The Grills : గుజరాత్‌లోని సూరత్‌లో ఒక వింత మరియు దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎన్ఆర్ఐకి చెందిన ఖాళీ ఇంట్లో చోరీ చేసేందుకు వెళ్లిన ఒక వ్యక్తి, లోపలికి ప్రవేశించే క్రమంలో అక్కడి ఇనుప గ్రిల్స్ మధ్యలో చిక్కుకుపోయాడు.
బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న అతడిని గమనించిన స్థానికులు, దాడికి పాల్పడ్డారు.
Hyderabad : అల్వాల్‌లో దారుణం..బాలికపై అత్యాచారం
Thief Stuck In The Grills
సూరత్‌లోని నానా వరాచా ప్రాంతంలో ఉన్న రాజారాంనగర్ సొసైటీకి చెందిన కిషోర్‌భాయ్ అనే వ్యక్తి చాలా కాలంగా ఇల్లు చాలాకాలంగా ఖాళీగా ఉండటంతో చోరీ చేయడానికి అనువుగా భావించిన ఒక వ్యక్తి రాత్రి వేళ ఆ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. భవనం లోపలికి వెళ్లే క్రమంలో తలుపు గ్రిల్స్ మధ్యలో అతడు బంధీ అయ్యాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రావడం సాధ్యం కాలేదు.
Thief Stuck In The Grills : కర్రలు, రాడ్లతో స్థానికుల దాడి – వీడియో వైరల్
ఉదయాన్నే అటుగా వెళ్తున్న స్థానికులు గ్రిల్స్‌లో ఒక వ్యక్తి ఇరుక్కుపోవడాన్ని గమనించి అక్కడ గుమిగూడారు. అతడు దొంగతనానికి వచ్చాడని గ్రహించి, ఆగ్రహంతో స్థానికులు కర్రలు, రాడ్లతో అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వీడియో నెట్టింట వైరల్ కావడంతో కపోద్రా పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ఘటన జరిగి పది రోజులు దాటిందని, అయితే దీనిపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని కపోద్రా సీఐ ఎం.ఆర్. సోలంకి తెలిపారు. అమెరికాలో ఉన్న ఇంటి యజమానిని సంప్రదించగా, ఇంట్లో నగదు లేదా విలువైన వస్తువులు ఏమీ లేవని, దొంగతనం జరగలేదని స్పష్టం చేశారు. వీడియో ఆధారంగా గ్రిల్స్‌లో చిక్కుకున్న వ్యక్తి వివరాలను, అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేసిన స్థానికులను గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

