Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి

వార్త 2 weeks ago

Vizianagaram Road Accident: విజయనగరం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం షికారుగంటి జంక్షన్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ధాటికి ఆటో పూర్తిగా ధ్వంసమైంది.

Read Also :80s Look Photos Fake Apps : సోషల్ మీడియాలో '80స్ రెట్రో లుక్' ట్రెండ్ - సైబర్ నేరగాళ్ల కొత్త ఉచ్చు

ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో..

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో షికారుగంటి జంక్షన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Vizianagaram Road Accident: మృతులు ఒకే గ్రామానికి చెందినవారు

ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిని బాడంగి మండలం గజరాయనివలస గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

జైపూర్‌లో తల్లి, కుమార్తెల హత్యోదంతం: కీలక ఆధారంగా వెంట్రుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha