Dailyhunt
చౌటకూర్ మండలంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు

చౌటకూర్ మండలంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు

వార్త 1 week ago

Good Friday 2026 Choutakur: మండలంలోని వివిధ గ్రామాలలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఘనంగా జరుపుకున్నారు.అందులో భాగంగా మండల కేంద్రంలోని సిఎస్ఐ సెంట్రల్ చర్చిలో ఇంచార్జ్ గురువులు రెవ ఎం.

రవికుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ఆరాధన నిర్వహించారు.ఈ సందర్బంగా రవికుమార్ మాట్లాడుతూ దేవుడు సిలువపై పలికిన ఏడు మాటలకు సంబందించిన విషయాలను వివరించారు.దేవునితో పాటు సిలువపై ఉన్న వారిని క్షమించడం, ప్రేమ, క్షమాపణను చాటడం. తన తల్లి మరియమ్మును శిష్యుడైన యోహానుకు అప్పగించడం, కుటుంబ బాధ్యతను చాటడం.

Read Also:Telangana WhatsApp Chatbot: ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. 'Hi' చెబితే చాలు!

Good Friday 2026 Choutakur: సుల్తాన్‌పూర్ లోనూ భక్తిశ్రద్ధలతో..

తన మరణాన్ని తండ్రి దేవుడికి అప్పగించడం, విశ్వాసాన్ని ప్రకటించడం.మానవాళి బాధను వ్యక్తం చేయడం, దేవుని నుండి విడిపోయిన భావనను చూపడం వంటి ఏడు మాటలు దేవుని యొక్క త్యాగం, ప్రేమ, క్షమాపణ, విశ్వాసాన్ని వివరిస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ గురువులు రెవ భాస్కర్,సుధర్మ అమ్మగారు,కమిటీ సభ్యులు అశోక్, రాజు, పురుషోత్తం, కరుణాకర్, సంసోన్, సంఘ పెద్దలు బేగరి దేవయ్య,బేగరి రాములు,బేగరి మత్తయి,గామని జోగయ్య,స్త్రీల మైత్రి సెక్రటరీ డప్పు సౌందర్య,మహిళలు, సండే స్కూల్ పిల్లలు, సంఘస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా సుల్తాన్పూర్ గ్రామంలో ఇన్చార్జి గురువులు రెవ బి ప్రభుదాస్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హరీష్ రావు మంచి మిత్రుడు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha