Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!

చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!

వార్త 6 days ago

Choutakur News: సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల పరిధిలోని ఉన్నపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల జాతీయ రహదారి 161 పై బటాయించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో చౌటకూర్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందు పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Read Also:Sangareddy district murder: ఎస్ ఇటిక్యాల శివారులో యువకుడు దారుణ హత్య

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొర్రా ప్రవీణ్ యాదవ్, రాష్ట్ర ట్రెజరర్ నరేన్ దేశ్‌పాండే, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చంటి ప్రభు, ఆందోల్ అసెంబ్లీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కన్వీనర్ పల్లె ప్రభుకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, విద్యార్థులు నిరసన చేపట్టారు. ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించేలా సీఎం చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం నాయకులు తీవ్రంగా ఖండించారు.

విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, యువ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలను బాగు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Choutakur News: కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ టేక్మాల్ ప్రవీణ్ అప్ప, కంది మండల అధ్యక్షుడు గిరిధర్, చౌటకూర్ మండల జీఎస్ పుట్టి మోహన్, వార్డు సభ్యుడు సాయికృష్ణ ముదిరాజ్, ఆందోల్ అసెంబ్లీ లీగల్ సెల్ కన్వీనర్ వినోద్ కుమార్ గౌడ్, బచ్చుగూడెం ప్రవీణ్ రెడ్డి, అరవింద్ పట్లోళ్ల, తెనుగు సాయికృష్ణ, చాకలి శివకుమార్, నీరుడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

చక్రియాలలో ఘనంగా బోనాల పండుగ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha