Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చౌటకూరులో ముగిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు

చౌటకూరులో ముగిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు

వార్త 1 month ago

Choutukur: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలోని వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నాలుగవ వార్షికోత్సవాలు ఆదివారం ముగిసాయి. రెండు రోజులుగా అంగరంగా వైభవంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి .

ముగింపు రోజైన ఆదివారం రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహర్షి కళ్యాణోత్సవం కన్నుల పం డువల సాగింది. స్థానిక గౌడ సంఘం అధ్వర్యంలో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన వితరణ చేపట్టారు.

Read Also:TRS : మీ టైమ్ ముగిసిందంటూ బిఆర్ఎస్ కు కవిత కౌంటర్

 Renuka Ellamma Temple Choutukur

Choutukur: అమ్మవారి సేవలో ప్రముఖులు

ఉత్సవాలను తిలకించేం దుకు పోసానిపల్లి, సరాప్పల్లి, సుల్తాన్పూర్, ఉప్పరిగూడెం, కోర్పోలు తదితర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలకు రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి, ఎంపీపీ మాజీ అధ్యక్షుడు భూంరెడ్డి సుభాష్ రెడ్డి, జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా జోగినాధ్, సర్పం చ్ పార్కల రాంరెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలి: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha