International Yoga Day: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌట్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎన్సీసీ అధికారి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులతో పాటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని యోగాసనాలు చేశారు.


International Yoga Dayఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్టీయూ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి హాజరై యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ యోగ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఎన్సీసీ అధికారి భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి యోగ సాధన చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగ చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మెదడు చురుకుగా పనిచేసి చదువులో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రాజు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

