CJP Protest : కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసి, నెటిజన్లను ఊపేసిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసనల పర్వం క్షేత్రస్థాయికి వచ్చేసరికి పూర్తిగా చల్లబడింది.
ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఏ సామాజిక మాధ్యమం చూసినా ‘కాక్రోచ్’ ట్రెండ్స్‌తో హల్‌చల్ చేసిన ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది. ఆయన అమెరికా (US) నుంచి భారతదేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి సీన్ మొత్తం మారిపోయింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కనిపించిన జోష్, ప్రత్యక్ష ఆందోళనల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. వర్చువల్ ప్రపంచంలో లక్షలాది మంది మద్దతు పలికినప్పటికీ, లండన్ లేదా అమెరికా వీధుల నుంచి ఢిల్లీ వీధులకు వచ్చేసరికి ఆదరణ దారుణంగా పడిపోయింది.

12 రోజులుగా జంతర్ మంతర్ వద్ద దీక్ష – నిరాశ పరిచిన యువత, సోనమ్ వాంగ్చుక్ మద్దతు
అభిజీత్ దీప్‌కు మద్దతుగా ప్రముఖ సామాజిక హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా రంగంలోకి దిగి ఆందోళనలు చేపట్టినప్పటికీ, ఆశించిన స్థాయిలో యువత ఈ నిరసనలకు తరలిరాలేదు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత 12 రోజులుగా అభిజీత్ దీప్ ప్రతిష్టాత్మకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ, అటు రాజకీయ వర్గాల నుంచి గానీ, ఇటు సాధారణ ప్రజల నుంచి గానీ కనీస స్పందన కరువైంది. అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక సోషల్ మీడియా ట్రెండ్.. క్షేత్రస్థాయి పోరాటంగా మారడంలో ఎలా విఫలమైందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేవలం అతికొద్ది మంది అనుచరులు, వాలంటీర్ల మధ్యే ఈ నిరసనలు ఏకాకిగా కొనసాగుతుండటం గమనార్హం.
"మా నీటి జోలికొస్తే చేతులు నరుకుతాం": పాక్ మంత్రి తీవ్ర హెచ్చరిక

