Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"మా నీటి జోలికొస్తే చేతులు నరుకుతాం": పాక్ మంత్రి తీవ్ర హెచ్చరిక

"మా నీటి జోలికొస్తే చేతులు నరుకుతాం": పాక్ మంత్రి తీవ్ర హెచ్చరిక

వార్త 4 days ago

Pakistan Minister warning to India: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న 'సింధూ నదీజలాల ఒప్పందం' (Indus Waters Treaty) వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.

ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం, ఇప్పుడు భారత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ తన అక్కసు వెళ్లగక్కింది. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎవరైనా తమ నీటి వాటాపై చేయి వేయాలని చూస్తే ఆ చేతులను నరికేస్తాం అంటూ తీవ్ర పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 25 మంది అమాయక పర్యాటకులను మతం అడిగి మరీ దారుణంగా కాల్చి చంపారు. ఈ రాక్షస కాండకు నిరసనగా భారత ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను పూర్తిగా నిర్మూలించే వరకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీనికి తోడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి. ఆర్. పాటిల్ మాట్లాడుతూ వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో సింధు జలాల్లో భారత్‌కు ఉన్న పూర్తి వాటాను తామే వినియోగించుకుంటామని, భారత్‌కు చెందాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్థాన్‌కు పోనివ్వబోమని స్పష్టం చేయడంతో పాక్‌లో వణుకు మొదలైంది.

Read Also: India China Border Dispute: భారత భూభాగంలో చైనా అక్రమ నిర్మాణాలు!

 Pakistan Minister warning to India

Pakistan Minister warning to India: ప్రధాని మోదీపై పాక్ మంత్రుల వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి ప్రకటనపై స్పందించిన పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్.. పక్క దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఒక నల్లా (టాప్) ఉందని, ఆయన పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లనివ్వనని అంటున్నారంటూ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో 40 నుంచి 50 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారని, తమ దేశ ఆహార భద్రతను, 25 శాతం ఆర్థిక వ్యవస్థను వేరొకరు నియంత్రించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ 1960లో ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయడం కుదరదని అన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు ఇప్పటికే “నీరే మా లైఫ్‌లైన్, మా రెడ్‌లైన్” అని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ అంశంపై అంతర్జాతీయంగా తమకు మద్దతు ఉందని, భారత్ ఏకపక్ష చర్యలపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (International Court) ఆశ్రయిస్తామని, అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

వర్షం వెనుకడుగు… రైతుకు ముందడుగు ఎప్పుడు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha