Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CJP నేతలేం సాధువులు కాదు అంటూ సోనమ్ వాంగుక్ కీలక వ్యాఖ్యలు

CJP నేతలేం సాధువులు కాదు అంటూ సోనమ్ వాంగుక్ కీలక వ్యాఖ్యలు

వార్త 2 weeks ago

CJP : సిజెపి (CJP) వ్యవస్థాపకులు లేదా నేతలు ఏమీ సాధువులు కాదని, వారికి కచ్చితంగా రాజకీయ ఆశయాలు (Political Ambitions) ఉన్నాయని ప్రముఖ పర్యావరణ వేత్త, విద్యావేత్త సోనమ్ వాంగుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రఖర్ గుప్తా నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన ఉద్యమ సమయంలో CJP నేతలైన అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను చాలా దగ్గరగా గమనించానని ఆయన తెలిపారు. ఉద్యమాలు లేదా నిరసనల్లో పాల్గొనే యువతకు రాజకీయ ఆకాంక్షలు ఉండటంలో ఎలాంటి తప్పు లేదని, ఏమీ ఆశించకుండా సేవ చేయడానికి వారేమీ సాధువులు కాదని ఆయన స్పష్టం చేశారు. యువ నాయకులు రాజకీయాల్లోకి రావడం లేదా స్వంత పార్టీలు స్థాపించడాన్ని తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు..

ఉద్యమ వేదిక తటస్థంగా ఉండాలన్న వాంగుక్ సూచన

వ్యక్తిగతంగా రాజకీయ ఆకాంక్షలు ఉండటం సాధారణ విషయమే అయినప్పటికీ, విద్యార్థుల లేదా ప్రజా ఉద్యమ వేదికను మాత్రం రాజకీయ రంగు పులుమకుండా తటస్థంగా (Neutral and Apolitical) ఉంచాలని ఆయన వారికి సూచించినట్లు చెప్పారు. ఏ రాజకీయ పార్టీ ప్రభావం లేకుండా ప్రెజర్ గ్రూప్‌గా (Pressure Group) పనిచేసినప్పుడే ప్రజాదరణ మరియు ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. నిరసన సమయంలో తమ వేదికను ఏ రాజకీయ పార్టీకీ అనుకూలంగా మార్చకుండా, న్యూట్రల్‌గా ఉంచడంలో సఫలమయ్యారని CJP నేతలను ఆయన అభినందించారు. భవిష్యత్తులో వారు ఏ రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నా, ప్రజా సమస్యలపై పోరాడిన ఈ అనుభవం వారిని మరింత పరిణతి చెందిన నాయకులుగా తీర్చిదిద్దుతుందని వాంగుక్ విశ్వాసం వ్యక్తం చేశారు.

గ్యాస్‌ వినియోగదారులకు నేడే ఆఖరి తేదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha