Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CSK కెప్టెన్సీ రూమర్లపై నోరు విప్పిన సంజూ..

CSK కెప్టెన్సీ రూమర్లపై నోరు విప్పిన సంజూ..

వార్త 3 months ago

Sanju Samson: చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్‌గా సంజూ శాంసన్ బాధ్యతలు చేపడతారని మాజీ క్రికెటర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి.

దీంతో ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ బయటకు వచ్చి చెన్నైలో చేరబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

Read also: Gujarat Titans: రాజస్థాన్‌పై విజయంతో రెండో స్థానానికి చేరిన గుజరాత్

 Sanju Samson clarifies on CSK rumors

Sanju Samson: సంజూ శాంసన్ ఇచ్చిన వివరణ

తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ప్రోమోలో సంజూ ఈ రూమర్లపై స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఏదైనా కొత్త జట్టులోకి వెళ్లేటప్పుడు ఎలాంటి డిమాండ్లు పెట్టకూడదని తాను నమ్ముతానని ఆయన స్పష్టం చేశారు. ఆటగాడిగా జట్టుకు సేవ చేయడం ముఖ్యం తప్ప, పదవుల కోసం ఆశపడటం తన నైజం కాదని సంజూ చాలా నిజాయతీగా చెప్పారు.

రూమర్లకు చెక్ పెట్టిన క్లారిటీ

తను కెప్టెన్సీ కోరుకుంటూ చెన్నై జట్టులోకి వెళ్తున్నాననే వార్తల్లో నిజం లేదని సంజూ మాటల ద్వారా అర్థమవుతోంది. రుతురాజ్ నాయకత్వాన్ని మార్చే ఉద్దేశ్యం మేనేజ్‌మెంట్‌కు లేదని, కేవలం ఊహాగానాల వల్లనే ఈ గందరగోళం ఏర్పడిందని తేలిపోయింది. సంజూ క్లారిటీతో ప్రస్తుతానికి చెన్నై కెప్టెన్సీ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సిక్సర్ల కింగ్ వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బద్దలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha